మోడీకి నోబెల్ శాంతి బహుమతి…నామినేట్ చేసిన తమిళిసాయి

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 50 కోట్ల మందికి లబ్ది కలిగేలా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీకి నోబెల్ శాంతి బహుమతి-20109 ఇవ్వాలన్నారు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసాయి సౌందరరాజన్. ప్రధాని మోడీ పేరుని నోబెల్ కమిటీకి నామినేట్ చేసినట్లు ఆమె తెలిపారు. దీనికి దేశ ప్రజలు అందరూ మద్దతు తెలపాలని ఆమె విజ్ణప్తి చేశారు.

ఆదివారం(సెప్టెంబర్-23) జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన-“ఆయుష్మాన్ భారత్” స్కీమ్ ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇలాంటి స్కీమ్ ప్రపంచంలో మరెక్కడా లేదని ఈ సందర్భంగా మోడీ తెలిపారు. 50 కోట్ల మంది ప్రజలు ఈ పథకం ద్వారా లబ్దిపొందనున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 13,000 ఆస్పత్రులు ఈ కార్యక్రమంలో భాగస్వామలుగా చేరినట్లు మోడీ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates