మోడీకి మాల్యా లేఖ : అనుమతివ్వండి.. ఆస్తులు అమ్మి అప్పు తీరుస్తా

modi-mallyaబ్యాంకుల్లో అప్పును నయా పైసలతో సహా చెల్లిస్తా.. ఒక్క రూపాయి తక్కువ.. ఎక్కువ కాదు.. అయితే భారతదేశంలోని కోర్టులు అనుమతి ఇవ్వాలి అంటున్నారు విజయ్ మాల్యా. భారతీయ బ్యాంకులకు రూ.9వేల కోట్ల అప్పు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యా.. అప్పట్లోనే ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ లేఖ సారాంశం ఇదీ..

బ్యాంక్ డీఫాల్ట్ విషయంలో తనను ఓ పోస్టర్ బాయ్ గా మార్చారు. రోడ్లపై సామాన్యుల ఆగ్రహానికి గురవుతున్నట్లు తెలిపాడు. తనపై భారత ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కూడా కలిగిస్తుందన్నారు. తాను అలసిపోయినట్టు తెలిపారు. అప్పులను రికవరీ చేయడం సివిల్‌ విషయం.. కానీ తన కేసును మాత్రం క్రిమినల్‌ కేసుగా పరిగణిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావటం లేదన్నారు. తన ఆస్తులను విక్రయించడానికి కోర్టు అనుమతి ఇవ్వాలని కోరారు. విక్రయించిన ఆస్తుల ద్వారా బ్యాంకులకు అప్పులు చెల్లిస్తానని లేఖ ద్వారా తెలిపారు మాల్యా. 2016, మార్చి 2వ తేదీన వివిధ బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్ కు విజయ్ మాల్యా లండన్ పారిపోయారు. భారత్‌ కు మాల్యాను అప్పగించే వ్యవహారంపై లండన్‌ కోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. 2016, ఏప్రిల్ 15వ తేదీన రాసిన ఈ లేఖను ఇప్పుడు బయటకు వచ్చింది.

Posted in Uncategorized

Latest Updates