మోడీకి వ్యతిరేకంగా…పాక్ తో కలిసి కాంగ్రెస్‌ అంతర్జాతీయ కూటమి : అమిత్ షా

రాఫెల్ ఇష్యూపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ప్రధాని మోడీ, అనీల్ అంబానీలు కలిసి భారత రక్షణ శాఖపై 130 వేల కోట్ల సర్జికల్ దాడులు చేశారని శనివారం(సెప్టెంబర్-22) రాహుల్ ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలపై ఇవాళ(సెప్టెంబర్-23) బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. ఈ విషయమై ట్విట్టర్ ద్వరా కాంగ్రెస్, పాకిస్ధాన్ లపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాఫెల్ డీల్ కి సంబంధించి రాహుల్ గాందీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అమిత్ షా అన్నారు. మోడీని దించేద్దాం అని రాహుల్‌ అంటుంటే….. పాకిస్ధాన్ రాహుల్ నిరాధార ఆరోపణలకు మద్దతు పలుకుతోందని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పాకిస్తాన్‌ తో కలిసి కాంగ్రెస్‌ అంతర్జాతీయ కూటమి ఏర్పాటు చేస్తుందా అని అమిత్ షా అన్నారు. తన ట్వీట్‌ లో పాకిస్తాన్‌ వద్దు, కాంగ్రెస్‌ వద్దు  (#NaPakNaCongress) అనే హాష్‌టాగ్‌ ని అమిత్ షా జతచేశారు.

Posted in Uncategorized

Latest Updates