మోడీకి హగ్ తర్వాత.. కన్నుకొట్టిన రాహుల్

లోక్ సభలో అనూహ్యమైన ఘటన. తన ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని మోడీ సీటు దగ్గరకు వెళ్లి కౌగిలించుకోవటం ద్వారా ట్విస్ట్ ఇచ్చిన రాహుల్ గాంధీ.. ఆ తర్వాత తన సీటు దగ్గరకు వెళ్లి కూర్చుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ సభ్యులు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ సమయంలో మిగతా ఎంపీలను చూస్తూ సరదాగా కన్నుకొట్టారు. మోదీని హగ్ చేసుకుని వచ్చిన తర్వాత.. భలే షాక్ ఇచ్చాన్ కదా అన్నట్లు ఉంది ఈ కన్నుకొట్టటం. రాహుల్ లోనూ కొత్త ఉత్సాహం కనిపించింది. ఫేస్ వెలిగిపోతుంది. హగ్ చేసుకుని.. ఆ తర్వాత కన్ను కొట్టిన రాహుల్ కు.. ప్రధాని మోడీ ఎలాంటి కౌంటర్ ఇస్తారు అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates