మోడీతో మంత్రి కేటీఆర్ భేటీ : తెలంగాణ హక్కు.. బయ్యారం స్టీల్ ప్లాంట్

MODI KTR

ఢిల్లీలో కీలక పరిణామాలు.. ముందస్తుగా ఎలాంటి సంకేతాలు లేకుండానే ప్రధానమంత్రి మోడీతో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. జూన్ 27వ తేదీ బుధవారం మధ్యాహ్నం మోడీ నివాసంలోనే.. వీళ్లిద్దరూ 30 నిమిషాలపైనే చర్చించుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలు, డిమాండ్లను మోడీకి వివరించారు కేటీఆర్. వినతిపత్రం కూడా అందించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, హక్కుగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని.. కేంద్రం భాగస్వామ్యం కావాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలన్నింటినీ సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైకోర్ట్ విభజనను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మోడీని కోరారు మంత్రి కేటీఆర్.

అదే విధంగా హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ (ITIR) ఎంతో కాలంగా పెండింగ్ లో ఉందన్నారు. రీజియన్ ఏర్పాటుకు అవసరం అయిన అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నాం అని.. కేంద్రం నిధులు విడుదల చేయాలని మోడీని కోరారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates