మోడీని దించలేరు : వీగిపోయిన ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం

అందరూ ఊహించినట్లుగానే NDA ప్రభుత్వంపై ప్రతిపక్షాలు లోక్ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మొత్తం 451 ఓట్లు పోలయ్యాయి. అవిశ్వాసానికి అనుకూలంగా 126, వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో లోక్ సభలో ఎంపీలు పెద్ద ఎత్తున మోడీ…మోడీ అంటూ నినాదాలు చేశారు. అవిశ్వాస తీర్మానంపై 12 గంటల చర్చ జరిగింది. ఓటింగ్ పూర్తయిన తర్వాత సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్. ప్రసంగ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పారు మోడీ. ప్రత్యేక ప్యాకేజీకే కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రధాని మోడీ ప్రసంగం ముగిసిన తర్వాత మాట్లాడిన టీడీపీ ఎంపీ కేశినేని నాని… మోడీలో ఓ గొప్ప నటుడున్నాడన్నారు. సభలో ప్రధాని పెద్ద డ్రామా నడిపించారన్నారు.

Posted in Uncategorized

Latest Updates