మోడీపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ..BJP ధర్నా

BJP DHARNAAP విజయవాడలో నిరసనకు దిగారు బీజేపీ నేతలు.  ప్రధాని మోడీపై టీడీపీ నేతల విమర్శలను నిరసనిస్తూ సోమవారం (జూన్-11) ఆందోళన చేస్తున్నారు. విజయవాడ ధర్నాచౌక్ లో జరుగుతున్న మహాధర్నాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ గోకరాజు గంగరాజు, కేంద్రమాజీ మంత్రి పురందేశ్వరి, ముఖ్య నేతలు పాల్గొన్నారు. టీడీపీ పాలనలో నియంతృత్వం పెరిగిపోయిందని విమర్శించారు నేతలు.

బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు బీజేపీ నేతలు. రాజకీయ లబ్దికోసమే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Posted in Uncategorized

Latest Updates