మోడీపై కేజ్రీ సెటైర్ : మన్మోహన్ సింగ్ ను కోల్పోయాం

KEJRIకొన్నిరోజులుగా సైలెంట్ గా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాని మోడీపై తీవ్రస్ధాయిలో మాటల యుద్దానికి దిగారు. మన్మోహన్ సింగ్ లాంటి విద్యావంతుడైన ప్రధానిని దేశ ప్రజలు కోల్పోయారన్నారు. దేశ ప్రధానమంత్రి విద్యావంతుడై ఉండాలని, అటువంటి వ్యక్తినే దేశ ప్రజలు ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. ప్రధాని మోడీ డిగ్రీ ఫేక్ అంటూ గతంలో కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏకంగా విద్యావంతుడైన ప్రధానే కావాలంటూ మన్మోహన్ సింగ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. అయితే మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో దృతరాష్ట్రుడితో మన్మోహన్ ను పోల్చారు కేజ్రీవాల్.

Posted in Uncategorized

Latest Updates