మోడీపై గుస్సా ఇందుకే : ఈ అంశాలపైనే టీడీపీ అవిశ్వాసం

తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై మరికొన్ని గంటల్లో చర్చ జరగబోతున్నది. గత పార్లమెంట్ సమావేశాల్లో 13సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ నోటీసులు ఇచ్చారు. అప్పట్లో చర్చకు రాలేదు. ఇప్పుడు టీడీపీ ఇచ్చిన నోటీస్ కు.. కాంగ్రెస్ మద్దతును పరిగణలోకి తీసుకున్న స్పీకర్.. జూలై 20వ తేదీ శుక్రవారం లోక్ సభలో చర్చ జరగబోతున్నది. ఇప్పుడు అందరిలో ఒకటే డౌట్.. టీడీపీ ఏయే అంశాలపై మోడీ సర్కార్ ను కడిగేయబోతున్నది అనేది. అందరూ ప్రత్యేక హోదా అంశం ఒక్కటే అనుకుంటున్నారు.. కానీ టీడీపీ ప్రత్యేక హోదాతోపాటు 18 అంశాలపై లోక్ సభలో చర్చకు సిద్ధం అయ్యింది. దీనిపై ఇప్పటికే కసరత్తు చేసిన పార్టీ.. ఎవరెవరు మాట్లాడాలి అనేది చంద్రబాబు నిర్ణయించనున్నారు.

అవిశ్వాసానికి కారణం అయిన అంశాలు ఇవే :

… పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వాలి.

… విభజన తర్వాత ఏపీకి ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేయాలి

… పోలవరం ప్రాజెక్ట్ కు 100శాతం నిధులు కేంద్రమే భరించాలి.

… విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి

… కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి.

… దుగ్గరాజపట్నం పోర్టు ఏర్పాటు చేయాలి.

… అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225 స్థానాలకు పెంచాలి

… ఏపీలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు పన్ను రాయితీలు ఇవ్వాలి

… కొత్త రాజధాని అమరావతిలో సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కేంద్రమే కట్టి ఇవ్వాలి. రాజధానికి అవసరం అయిన నిధులు విడుదల చేయాలి.

… కాకినాడలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలి.

… షెడ్యూల్ 9, 10 కింద ఆస్తులు – అప్పుల పంపిణీ పూర్తి చేయాలి. షెడ్యూల్ 13 కింద జాతీయ ఇనిస్టిట్యూట్స్ ఏర్పాటు చేయాలి.

… విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుతోపాటు నిధులు విడుదల చేయాలి.

…  ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పూర్తి చేయాలి.

… పన్ను విధింపులు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాలపై ఉన్న వ్యత్యాసాలను సవరించాలి.

… కొత్త రాజధాని అమరావతికి రోడ్ అండ్ రైల్వే కనెక్టెవిటీతోపాటు ర్యాపిడ్ రోడ్ నిర్మాణం చేపట్టాలి.

… విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ లను కేంద్రమే చేపట్టాలి.

… శాంతి భద్రతల కోసం గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పాలి.

ఇవన్నీ కూడా విభజన చట్టంలో ఉన్నా అమలు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మోడీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది టీడీపీ. ఇక్కడ ఒకే ఒక్క ట్విస్ట్ మాత్రమే ఉంది. ప్రత్యేక హోదా వద్దు.. కేంద్రం ఇస్తున్న ప్యాకేజీనే బాగుందని ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ధన్యవాద తీర్మానం చేయటం విశేషం. ఆ తర్వాత రెండేళ్లకు యూటర్న్ తీసుకుని హోదాతోపాటు.. ఇవన్నీ ఇవ్వాలని.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మోసం చేస్తుందని ఉద్యమం చేపట్టారు. ఇప్పుడు ఏకంగా మోడీపైనే అవిశ్వాసం పెట్టి.. యుద్ధం ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు..

 

Posted in Uncategorized

Latest Updates