మోడీపై ట్రంప్ సెటైర్లు… అబ్బో ఆయన చెప్పారండీ

ppcభారత ప్రధాని మోడీపై సెటైర్లు వేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గడిచిన రెండు వారాల్లో మోడీపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేయడం ఇది రెండోసారి. సోమవారం(ఫిబ్రవరి26) యూఎస్ చట్టప్రతినిధులతో సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ… మోదీని అనుకరిస్తూ రెండు చేతులూ జోడించి నమస్తే చెబుతూ సెటైర్ వేశారు. మోదీ చాలా మంచివారు. ఆయన ఏం చెప్పారంటే… మన మోటార్‌ వెహికల్స్ పై పన్నును 50 శాతానికి తగ్గించారట. దీనికి నేను ఏం చెప్పగలను. ఇది విని నేను థ్రిల్ ఫీలవ్వాలా అంటూ మోడీపై ట్రంప్ సెటైర్ వేశారు. కొన్నాళ్లుగా వాణిజ్యం విషయంలో ఏ దేశంతోనైనా ట్రంప్ కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మిత్రదేశమైనా సరే ఇండియా వ్యవహరిస్తున్న తీరుపై ట్రంప్ ఫైర్ అవుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates