మోడీపై మళ్లీ ట్వీట్ చేసిన రమ్య

ప్రధాని మోడీని తన ట్విట్టర్‌ ఖాతాలో ‘దొంగ’ అని ట్వీట్ చేసినందుకు మాజీ ఎంపీ కాంగ్రెస్‌ నాయకురాలు రమ్య పై ఉత్తర్‌ప్రదేశ్‌ లక్నోలోని గోంతీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో దేశద్రోహం కేసు నమోదైంది. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అగ్రిమెంట్ లో మోడీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్న క్రమంలో ఆమె సోమవారం (సెప్టెంబర్-24) ఈ ట్వీట్ చేశారు. అయితే ఆమె… తాజాగా మరోసారి అదే పదాన్ని వాడుతూ మోడీపై విమర్శలు చేశారామె. తనపై కేసు పెట్టిన వారిని ఎగతాళి చేశారు.

నాకు మద్దతు తెలుపుతున్న వారికి కృతజ్ఞతలు… ఆ ట్వీట్‌ని ఇష్టపడని వారికి నేనేం చెప్పాలి? తర్వాత ట్వీట్ చేసేటప్పుడు మరింత కొత్తగా చేస్తాను. దేశద్రోహం చట్టానికి దేశం దూరంగా ఉండాలి. దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు’ అని తనపై కేసు పెట్టిన సయ్యద్‌ రిజ్వాన్‌ అహ్మద్‌ అనే న్యాయవాదిని ఎగతాళి చేశారు. అలాగే మోడీని ‘దొంగ’ అని పేర్కొంటూ యాష్‌ ట్యాగ్‌ను కూడా జత చేశారు రమ్య.

Posted in Uncategorized

Latest Updates