మోడీపై రసాయన దాడి చేస్తానన్న యువకుడి అరెస్టు 

ప్రధాని నరేంద్ర మోడీపై రసాయన దాడి చేస్తానని చెప్పిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ (NSG) కంట్రోల్‌ రూమ్‌కు కాశీనాథ్‌ మండల్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసి ప్రధాని మోడీపై రసాయన దాడి చేస్తానని చెప్పాడు. ఢిల్లీలోని NSG కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ సంపాదించి అతడు దాడి చేస్తానని చెప్పడంతో NSG అధికారులు అతడి నెంబర్‌ను ట్రాక్‌ చేసి ముంబై పోలీసులకు సమాచారం అందించారు. ముంబై డిబి మార్గ్‌ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates