మోడీ అయోధ్యకు ఎందుకు వెళ్లలేదు…శివసేన చీఫ్ సంచలన ప్రకటన

 అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఇప్పటివరకూ అయోధ్యను ఎందుకు సందర్శించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు ఉద్ధవ్ థాకరే. బీజేపీ ప్రభుత్వం రామమందిరం నిర్మాణం చేపట్టాలి..లేకపోతే ఇది కూడా ఓ జిమ్మిక్కు అని ఒప్పుకోవాలని థాకరే అన్నారు. గురువారం ముంబైలో జరిగిన దసరా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

నవంబరు 25న అయోధ్య వెళ్లనున్నట్లు ఉద్దవ్ తెలిపారు. రామమందిర నిర్మాణం విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారనే విషయంపై ప్రధానమంత్రిని ప్రశ్నిస్తానని తెలిపారు. మోడీకి తాను శత్రువు కాదని, కాని ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని మాత్రమే తాను ప్రధానిని కోరతానని ఉద్దవ్ అన్నారు. రామమందిరం నిర్మిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ దాన్ని ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతృత్వంలోని సర్కారు పాలనలో ధరలు పెరిగాయని ఆరోపించారు. మహారాష్ట్రలో కరవు పరిస్థితులు ఏర్పడినా రాష్ట్రాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించలేదని ఉద్దవ్ అన్నారు.

Posted in Uncategorized

Latest Updates