మోడీ ఎనర్జీ సీక్రెట్ ఇదే : రోజూ కిలో చొప్పున.. తిట్లు తింటా

modi-secreatమోడీ.. తెల్లవారుజామున యోగాతో ప్రారంభం అవుతుంది.. ఉదయం ఎంత ఎనర్జీగా అయితే ఉంటారో రాత్రి పడుకునే వరకు అదే ఉత్సాహంగా ఉంటారు ప్రధాని మోడీ. ఇదే విషయాన్ని ఓ అభిమాని ప్రశ్నించాడు. ఐదు రోజుల విదేశీ పర్యటనలో ఉన్న మోడీ.. ఏప్రిల్ 18వ తేదీ రాత్రి లండన్ లోని భారతీయులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి మోడీ స్టామినా సీక్రెట్ ఏంటీ అని అడిగారు. దీనికి  మోడీ చెప్పిన సమాధానంతో సభ మొత్తం నవ్వులే నవ్వులు.

20 సంవత్సరాలుగా.. ప్రతి రోజూ కనీసం కేజీ నుంచి రెండు కేజీల వరకు తిట్టు తింటూ ఉంటా. వారి తిట్లే నాకు దీవెనలు. దేశం కోసం 20ఏళ్లుగా కష్టపడుతున్నాను.. అయినా రోజూ కిలో, రెండు కిలోల తిట్టు తిడుతూనే ఉన్నారు. వాటిని తింటున్నాను కాబట్టే ఇంత ఎనర్జీగా ఉంటున్నా అంటూ సమాధానం చెప్పి నవ్వులు పూయించారు. ఈ సమాధానంతో స్టేడియం అంతా మోడీ జిందాబాద్ అంటూ చప్పట్లతో మార్మోగిపోయింది. మోడీ ప్రసంగాల స్కిల్స్ మరోసారి అందరినీ ఆకట్టుకుంది. మోడీ కూడా అందరినీ చూస్తూ నవ్వుతూ ఉండిపోయారు.

Posted in Uncategorized

Latest Updates