మోడీ చురకలు : రామాయణంలోనే ఇంతటి నవ్వు చూశా

renukaఈ రోజు(ఫిబ్రవరి7) రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగిస్తున్న సమయంలో ఓ ఆశక్తికర పరిణామం చోటు చేసుకొంది. మోడీ ప్రసంగ సమయంలో కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి పదేపదే అడ్డుపడ్డారు. కాంగ్రెస్ నాయకులతో కలసి రేణుకాచౌదరి ప్రధాని ప్రసంగానికి అడ్డుపడుతున్న సమయంలో రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రధాని ప్రసంగానికి అడ్డు తగలవద్దంటూ రేణుకను మందలిస్తుండగా మోడీ జోక్యం చేసుకుంటూ ‘సభాపతిగారు.. రేణుకాజీని ఏమీ అనొద్దని మిమ్మల్ని కోరుతున్నా.. రామాయణం సీరియల్‌ తర్వాత ఇంతటి నవ్వులను వినే సౌభాగ్యం ఇప్పుడే దక్కింది’ అంటూ మోడీ రేణుకాచౌదరికి చురకలు అంటించడంతో సభలో అందరూ పగులబడి నవ్వారు. ఈ విషయాన్ని మోడీ తన ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates