మోడీ చులకనగా మాట్లాడటం భాధాకరం : చంద్రబాబు

అవిశ్వాస తీర్మానం సందర్భంగా  శుక్రవారం(జులై-20) లోక్ సభలో ప్రధాని ప్రసంగంపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.  ప్రసంగ సమయంలో ప్రధాని మోడీ తనపై ఎదురుదాడి చేశారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.నాలుగేళ్లలో 29 సార్లు ఢిల్లీ వెళ్లానన్నారు. ఏపీకి న్యాయం చేయడం పక్కనబెట్టి తాను యూటర్న్ తీసుకున్నానని తనపై మోడీ పొలిటికల్ ఎటాక్ చేశారన్నారు. మోడీ అహంకారంతో మాట్లాడారన్నారు. ప్రధాని చులకనగా మాట్లాడటం భాధాకరమన్నారు. ఏపీకి అన్యాయం జరిగింది కాబట్టే చివరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. కేంద్రం ధర్మాన్ని తప్పిందని, న్యాయం చేయకపోవడంతోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. వాళ్లు పెట్టిన విభజన  చట్టాన్ని అమలు చేయడం లేదని, ప్రత్యేక హోదాను కూడా పట్టించుకోలేదని బాబు అన్నారు.  భాధ్యతల నుంచి బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. పవన్ కళ్యాణ్, జగన్ ల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు మోడీ ప్రసంగాన్ని అడ్డుకున్నప్పుడు ఈ ఇద్దరు నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రజాసొమ్మును కాజేసి ఒకరు కోర్టుకెళ్తే… మరొకరు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారని సెటైర్లు వేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని బాబు తెలిపారు. NDA ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాశానికి అనుకూలంగా 126 ఓట్లు వచ్చాయి.  అవిశ్వాసానికి వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. మొత్తం 451 ఓట్లు పోలయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates