మోడీ పాలనలో దేశానికో న్యాయం..రాష్ట్రానికో న్యాయం : ఈటల

etelaపన్ను రూపంలో 50వేల కోట్ల పైచిలుకు తెలంగాణ ప్రజలు.. తమ చెమట రూపంలో కేంద్రానికి పంపిస్తున్నారని, అయితే కేంద్రం మాత్రం రాష్ట్రానికి ఇచ్చిందేమీలేదన్నారు మంత్రి ఈటల. మంగళవారం (మార్చి-27) శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు ఈటల. అభివృద్ధి కోసం అప్పులుచేయక తప్పదన్నారు. ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుదని, దీంతో దేశం బాగుపడుతుందన్నారు. ప్రస్తుతం దేశానికో న్యాయం..రాష్ట్రానికో న్యాయం ఉందన్నారు.

ప్రధాని మోడీ చెప్పిన మాటలు ఆచరణలో అమలు కావడంలేదని, కొత్త రాష్ట్రానికి ఎక్కువ నిధులు అవసరమవుతాయని చెప్పారు. 2018 కల్లా మిడ్ మానేరు పూర్తి చేస్తామని, హరీశ్ చెప్పారని, అయితే అనుకున్న విధంగా కేంద్రం నిధులను మంజూరు చేయడంలో విఫలమైందన్నారు. రాష్ట్రాలకు కేంద్రం సహకరించడం లేదని, అప్పు తెచ్చుకునేందుకు కూడా కేంద్రం ఒప్పుకోవడం లేదన్నారు. రాష్ట్రం వేరు, కేంద్రం వేరు అనే సంకుచిత భావం ఉండొద్దని కేంద్రానికి సూచించారు. విద్యతో అసమానతలు తొలగిపోతాయన్నారు మంత్రి ఈటల.

Posted in Uncategorized

Latest Updates