మోడీ ప్రభుత్వ విధానాలపై ఫైర్ అయిన బీజేపీ సీనియర్ లీడర్ అరుణ్ శౌరి

shouriమోడీ ప్రభుత్వ విధానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ బీజేపీ లీడర్, మాజీ కేంద్రమంత్రి, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత అరుణ్ శౌరి. కశ్మీర్ పై కానీ, పాకిస్ధాన్ పై కానీ మోడీ ప్రభుత్వానికి ఎటువంటి విధివిధానాలు లేవని తెలిపారు. మోడీ గవర్నమెంట్ ని  “ఈవెంట్- ఓరియంటెడ్ అండ్ ఎలక్షన్- ఓరియంటెడ్” గా వర్ణించారు. పరిపాలనను పక్కనబెట్టి  కేవలం ఈవెంట్లను ఆర్గనైజ్ చేయడం, ఎలక్షన్లలో గెలవడమే విధానంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని అరుణ్ శౌరి అన్నారు. బ్యాంకింగ్ కు సంబంధించి కూడా మోడీ ప్రభుత్వానికి ఎటువంటి పాలసీ లేదన్నారు. సీనియర్ కాంగ్రెస్ లీడర్ సైఫుద్దీన్ రాసిన కాశ్మీర్ గ్లింప్స్ ఆఫ్ హిస్టరీ బుక్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన శౌరి మాట్లాడుతూ…. సర్జికల్ స్ట్రైక్స్ ను ఫేక్ స్ట్రైక్స్ గా వర్ణించారు. ఇండియన్ ఆర్మీ వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారని, అయితే ఆ క్రెడిట్ అంతా కేంద్రానిదే అంటూ మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, ఫేక్ స్ట్రైక్ అని మోడీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాత్రమే తాను అంటున్నానని ఆయన తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates