మోడీ భార్య జశోదాబెన్ : నా రాముడు, దేవుడు ఆయనే

Jashodaben -modiమధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ భార్య జశోదాబెన్ విచారం వ్యక్తం చేశారు. మోడీకి వివాహం కాలేదు. ఆయనకు భార్య, పిల్లలు లేనప్పటికీ.. మహిళలను, పిల్లల బాధను అర్థం చేసుకోగలరని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై జశోదాబెన్ తీవ్ర కలత చెందారు. నరేంద్ర మోడీకి పెళ్లికి కాలేదని ఆనందీబెన్ చెప్పడం సరికాదన్నారు. మోడీ బాధ్యతయుతమైన వ్యక్తి అని.. ఆయన తనకు రాముడు లాంటి వ్యక్తి అని అన్నారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో మోడీనే స్వయంగా తనను పెళ్లి చేసుకున్నట్లు నామినేషన్‌లో తెలిపినట్లు జశోదాబెన్ గుర్తు చేశారు. ఉన్నత విద్యావంతురాలైన ఆనందీబెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.

మోడీ ప్రధాని పీఠం అధిరోహించడానికి కొన్ని రోజుల ముందే ఆయన భార్య యశోదాబెన్‌ పటేల్‌ గురించి అన్ని టీవీ చానెల్స్‌లో ప్రచారం జరిగింది. ఆ సమయంలో కొన్ని టీవీ చానెల్స్‌ యశోదాబెన్‌ను ఇంటర్వ్యూ చేశాయి. ఆ సమయంలో యశోదాబెన్‌ తనకు, మోడీకి వివాహం అయ్యిందని.. వృత్తిపరమైన బాధ్యతల వల్లే వేర్వేరుగా ఉంటున్నామని తెలిపారు యశోదాబెన్.

Posted in Uncategorized

Latest Updates