మోడీ, రాహుల్ హగ్ : పోస్టర్లతో కాంగ్రెస్ ప్రచారం

రాహుల్ గాంధీ, మోడీ హగ్ పై టీవీల్లో, సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీన్నే ఆసరాగా తీసుకున్న కాంగ్రెస్ ప్రచారానికి వాడుకుంటోంది. దీంతో వీరిద్దరి హగ్ పోస్టర్లు హల్ చల్ చేస్తున్నాయి. రెండు రోజులుగా హాట్ టాపిక్ గా నిలిచిన ప్రధాని మోడీని, రాహుల్ హగ్ చేసుకున్న సన్నివేశపు పోస్టర్లు ముంబై గల్లీల్లో కనిపించాయి. ఆదివారం ఉదయం మంబైలో ఎటు చూసినా ఈ పోస్టర్లే దర్శనమివ్వడంతో నగరవాసులు ఆశ్చర్యపోయారు. లోక్‌ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం (జూలై-20) ప్రధాని నరేంద్ర మోడీని రాహుల్ గాందీ హగ్ చేసుకున్న పోస్టర్లు ముంబైలోని అంధేరి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఈ పోస్టర్లు ఏర్పాటు చేసింది. మేము గెలుస్తాం. విద్వేషంతో కాదు…ప్రేమతో .. (నఫ్రత్ సే నహీ…ప్యార్‌ సే జీతేంగే) అనే మెసేజ్ కూడా ఈ పోస్టర్లలో చేర్చారు.

పార్లమెంటులో చర్చ సందర్భంగా రాహుల్ వివిధ అంశాలు ప్రస్తావిస్తూ నేను మీ దృష్టిలో పప్పూనే కావచ్చు, నాపై మీకు చాలా ద్వేషం ఉంది, కానీ నాకు మీ మీద కోపం లేదు అని BJP, RSS , మోడీలను ఉద్దేశించి మాట్లాడారు. తన ప్రసంగం చివర్లో మోడీ సీటు వద్దకు వెళ్లి ఆయన కూర్చుండగానే కౌగలించుకున్నారు. రాహుల్ తన ఇష్టం లేకుండానే కౌగలించుకున్నాడని, తనను సీట్లోంచి లేవాలని సైగలు చేశారని, అయినా పీఎం సీటుపై రాహుల్‌ కు అంత తొందర తగదని మోడీ శనివారం (జూలై-21) తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పేరున్న బీజేపీ సీనియర్ నేత సైతం రాహుల్‌ చర్యను ఎద్దేవా చేశారు. రాహుల్ కౌగిలింత తర్వాత మోడీ వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిందంటూ ఓ సలహా ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం విద్వేషంపై ప్రేమదే ఎప్పుడూ పైచేయి. ప్రేమతో విద్వేషాన్ని జయించవచ్చని ప్రపంచానికి రాహుల్ చాటారు అంటూ రాహుల్ చర్యను సమర్ధించింది.

Posted in Uncategorized

Latest Updates