మోడీ సభకు వెళ్తుండగా..! స్కూల్ బస్ బోల్తా.. 35 మందికి గాయాలు

హిమాచల్ ప్రదేశ్ లో స్కూలు బస్సు ప్రమాదం జరిగింది. ఇవాళ గురువారం ఉదయం… కాంగ్రా జిల్లాలోని జవాలీ అనే కొండ ప్రాంతం రోడ్డుపై.. స్కూలు బస్సుకు యాక్సిడెంట్ అయ్యింది. రోడ్డు పక్కనుంచి లోయలోకి జారిన బస్సు.. బోల్తా కొట్టింది. బస్సులో ఉన్న 35 మంది స్కూలు పిల్లలు గాయపడ్డారు. బస్సు ఎడమవైపుకు బోల్తా కొట్టడంతో… పిల్లలంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. కింద వైపున ఉండిపోయిన ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు.. పిల్లలను దగ్గర్లోని హాస్పిటల్ లో చేర్పించారు. తీవ్రంగా గాయపడిన వారి కండీషన్ క్రిటికల్ గా ఉందని డాక్టర్లు చెప్పారు.

ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్ అభర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరయ్యేందుకు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ విద్యార్థులను ఓ ప్రైవేటు స్కూలు బస్సులో తరలించారు నిర్వాహకులు. ధర్మశాలకు 37 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. అడ్డంగా పడిపోయిన బస్సునుంచి… అద్దాలను పగులకొట్టి పిల్లలను బయటకు తీశారు స్థానికులు.

Posted in Uncategorized

Latest Updates