మోడీ సభలో కూలిన టెంట్ : స్పీచ్ ఆపేసి.. ఆస్పత్రికి వెళ్లిన ప్రధాని

ప్రధాని మోడీ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన.. మిధనపూర్ పట్టణంలోని ఓ సభలో పాల్గొన్నారు. భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు ఈ సభలో. మోడీ కూడా స్పీచ్ దంచేస్తున్నారు.. సరిగ్గా అదే సమయంలో సభా స్థలంలోని ఓ టెంట్ కూలిపోయింది. అందులో వందల సంఖ్యలో చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన మోడీ.. తన వ్యక్తిగత, భద్రత సిబ్బందిని పురమాయించారు. వెంటనే వెళ్లి వారిని కాపాడాలని ఆదేశించారు. తన సెక్యూరిటీ సిబ్బందిని సైతం రెస్క్యూ ఆపరేషన్ కోసం పంపించారు. బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా వారిని కాపాడాలని మైక్ ద్వారా పిలుపునిచ్చారు.

ప్రధాని మోడీ సైతం వేదిక నుంచే ఆదేశాలు ఇవ్వటంతో భద్రతా సిబ్బంది, కార్యకర్తలు వెంటనే స్పందించారు. టెంట్ కింద ఉన్నవారిని బయటకు తీసుకొచ్చారు. 20 మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మోడీ తన ప్రసంగం ఆపేసి.. వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్యంపై డాక్టర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోకల్ ఆస్పత్రికి ముందస్తు సమాచారం లేకుండా ప్రధాని మోడీ రావటంతో అంతా కలకలం. 20 నిమిషాలు ఆస్పత్రిలోనే ఉండి.. బాధితుల వివరాలు తెలుసుకుని వెళ్లారు మోడీ…

Posted in Uncategorized

Latest Updates