మోడీ సింగపూర్ టూర్ : పలు ఒప్పందాలపై సంతకాలు చేసిన మోడీ, లీ

leeప్రధాని నరేంద్ర మోడీ సింగపూర్ చేరుకున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ కోసం మూడుదేశాల పర్యటనలో భాగంగా సింగపూర్ వెళ్లారు మోడీ. ఈ ఉదయం సింగపూర్ ఎయిర్ పోర్టులో దిగిన ప్రధానికి…ఘన స్వాగతం పలికారు అధికారులు. సింగపూర్ ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇస్తానాకు చేరుకున్న మోడీ గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఆ దేశ అధ్యక్షుడు హలిమా యాకోబ్, ప్రధాని లీ హ్యేన్ లూంగ్ ఆత్మీయ ఆహ్వానం పలికారు. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలపై చర్చించారు. పలు ఒప్పందాలపై ఇరు దేశ అధినేతలు సంతకాలు చేశారు. మధ్యాహ్నం నాన్యాంగ్ యూనివర్సిటీని సందర్శిస్తారు మోడి. సాయంత్రం షాంగ్రీలా డైలాగ్ కు సంబంధించి స్పీచ్ ఇస్తారు.

Posted in Uncategorized

Latest Updates