మోడీ – స్టీఫన్ : స్టాక్ హోమ్ లో ప్రధానుల వాకింగ్ మీటింగ్

sdfఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా స్వీడన్ లో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో వివిధ అంశాలపై ఆ దేశంతో చర్చలు జరిపారు. స్వీడిష్ ప్రధానమంత్రి స్టీఫస్ లోఫ్వెన్ ను కలుసుకున్నారు. ప్రధాని మోడీకి స్వీడన్ అధికారులు ఘనస్వాగతం పలికారు.

భారత్ – స్వీడన్ ల మధ్య స్నేహబంధాల బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈ ఇద్దరూ చర్చించారు. వర్తక, వ్యాపార, అంశాలపై ఈ ఇద్దరు నేతలు చర్చించారు. సాగర్ హౌస్ నుంచి ఈ ఇద్దరు ప్రధాన మంత్రులు తమ కార్లను విడిచిపెట్టి.. కాలినడకతో రోసన్ బాద్ కు చేరుకున్నారు. అంతకుముందు స్వీడన్ కింగ్ XVI గుష్టాఫ్ ను మోడీ కలుసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates