మోడీ హయాంలో ఈవీఎంలకు రహస్య శక్తులు.. రాహుల్ ట్వీట్

తెలంగాణ, రాజస్థాన్ లో ఎన్నికలు పూర్తవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మోడీ పాలనలో ఈవీఎం లకు రహస్య శక్తులున్నాయని అన్నారు.  “మోడీ భారత దేశంలో.. ఈవీఎంలకు రహస్య శక్తులు ఉన్నాయి.. మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌ అనంతరం చిత్రమైన లీలలు జరిగాయి. కొందరు ఈవీఎంలు ఉన్న బస్సు దొంగిలించారు, రెండు రోజుల పాటు కనిపించకుండా పోయారు. తర్వాత వాళ్లు ఓ హోటల్‌లో తాగుతూ పట్టుబడ్డారు” అని రాహుల్ ట్వీట్ చేశారు. మోడీ ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలువడం లేదనే అభిప్రాయాన్ని రాహుల్ వ్యక్తం చేశారు.

ఈవీఎంలను స్కూల్ బస్సులలో తరలిస్తున్నారని, సరైన భద్రత కల్పించడం లేదని కాంగ్రెస్ ఫైర్ అయింది. తెలంగాణ, రాజస్థాన్‌లలో ఈరోజు పోలింగ్‌ ముగియడంతో ఐదు రాష్ట్రాల్లో పోలింగ్‌ పూర్తయింది. డిసెంబరు 11న తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates