మోడీ హిట్లర్, అమిత్ షా గోబెల్ : సిద్దరామయ్య

sidda ramaiahసీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా తరువాత కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు. రాజ్ భవన్ కేంద్రంగా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి. మెజార్టీ లేకపోయినా బీజేపీ అధికారం కోసం ప్రయత్నించి ఓడిపోయిందన్నారు. చివరకు ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్. కిడ్నాప్ చేసినా కూడా తమ ఎమ్మెల్యేలు తమకే మద్దతిచ్చారన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు ఆజాద్. భారత రాజకీయ చరిత్రతో ఇది ఒక చారిత్రాత్మక ఘటన అని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రత్నించి ఓడిపోయారన్నారు. నరేంద్ర మోడీ హిట్లర్,  అమిత్ షా గోబెల్ లా వ్యవహరిస్తున్నారన్నారు. చేతిలో అధికారం ఉందని ఏమైనా చెయ్యవచ్చని బీజేపీ నేతలు అనుకుంటున్నారని సిద్దరామయ్య తెలిపారు. బీజేపీ నాయకులు ఎంత ఆశ చూపించినప్పటికీ కాంగ్రెస్-జేడీఎస్ సభ్యులు వాటికి లొంగలేదని, కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు సిద్దరామయ్య.

Posted in Uncategorized

Latest Updates