మోత్కుపల్లి సంచలన ఆరోపణలు : పార్టీ నుంచి గెంటేయటానికి టీడీపీలో కుట్ర

TTDP-Leader-Motkupalliటీడీపీ నుంచి తనను గెంటేసే కుట్ర జరుగుతుందన్నారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు. 30ఏళ్లుగా పార్టీకోసం  నిజాయితీగా పనిచేస్తున్నా తనకు…పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వకుండా అవమాన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు పార్టీని విడిచి వెళ్లినా.. కష్ట సమయాల్లో అండగా ఉన్నానని చెప్పారు. ఎన్నో ఆపదల నుంచి బాబును కాపాడానన్నారు.

దళితుడిని కాబట్టే చిన్నచూపు చూస్తున్నారన్నారు మోత్కుపల్లి. ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం నడుస్తుందని.. తనకు గవర్నర్ పదవి రాకుండా ఆపింది నిజం కాదా అని బాబును ప్రశ్నించారు మోత్కుపల్లి. ఇది కుట్ర కాదా అని ప్రశ్నించారు. నాకు ఇవ్వాల్సిన ఎంపీ పదవిని.. గరికపాటి, టీజీ వెంకటేష్ కు ఇవ్వలేదా అని నిలదీశారు. పిచ్చుకపై బ్రహ్మోస్త్రంగా నాపై ఎందుకు ఇంత పగ పట్టారని నిలదీశారు బాబుని. మిమ్మల్ని నమ్మి పని చేసినందుకు షుగర్ వ్యాధి కూడా వచ్చిందన్నారు. ఇప్పటికైనా నన్ను పిలవాలని.. లేదంటే ఆంధ్రకు వచ్చి ఊరూరూ తిరిగి ఏం తప్పు చేశానో చెబుతా అన్నారు. నేను మీటింగ్ పెట్టినా 10వేల మంది వస్తారని.. అలాంటిది మహానాడుకి ఎందుకు అంత తక్కువ మంది వచ్చారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నాకు మంచి మిత్రుడు అని.. ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం ఏంటి అన్నారు. పార్టీ నుంచి గెంటేయటానికి టీడీపీలో కుట్ర జరుగుతుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

 

 

Posted in Uncategorized

Latest Updates