మోదీ..PNB స్కాం : ఒకే బ్యాంకులో ఏడేళ్లపాటు మోసం

81154-pkfyqiykxz-1517829124పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి షాకింగ్‌ విషయాలువెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో PNB టాప్‌ అధికారి, RBI ముఖ్య అధికారుల పాత్ర ఉందన్న అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా PNB ఛైర్మన్ సహా‌,  RBI  ఉన్నతాధికారులను CBI దృష్టి  పెట్టిందని మనీ కంట్రోల్‌ రిపోర్ట్‌ చేసింది.

వేలకోట్ల అవినీతిని ఆయా బ్యాంకు శాఖల ఇంటర్నల్‌ ఆడిటింగ్‌ సందర్భంగా RBI ఎందుకు కనిపెట్టలేదనే విషయాన్ని  CBI వర్గాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం.  అలాగే CBIకి ఫిర్యాదు చేసిన అంశాన్ని ఎక్సేంజీలకు వెల్లడించడం తమ విచారణలో అడ్డంకిగా మారిందని తెలిపింది. అంతేకాదు ఈ విషయంలో నిందితులను అప్రమత్తం చేయాల్సిన అవసరలేదని వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారులతో సహా  ఈ మెగా స్కాంలో  ఎవ్వరినీ విడిచిపెట్టేదిలేదని తెలిపింది CBI.

ఏడేళ్లు ఒకేచోట ఎలా సాధ్యం

గోకుల్‌నాథ్‌ శెట్టి ఏడేళ్లపాటు ఒకే స్థానంలో కదలకుండా ఉండి.. నీరవ్‌ మోదీకి, గీతాంజలి జెమ్స్‌కు బ్యాంకు తరఫున లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌లను (LOU) జారీ చేశారు. ఈ ఏడేళ్లలో ఒక్కసారి కూడా విషయం బయటకు రాలేదు. ఎవరికంటా పడలేదు. పోనీ ఈ ఏడేళ్లలో ఆయన కొన్నిరోజులు సెలవు పెట్టడం చేసుంటారు కదా.. అప్పుడైనా ఆయన స్థానంలో వచ్చినవారికి విషయం తెలియాలి కదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates