మోనో రైల్ నిర్మాణానికి వరంగల్ అనుకూలం

MONORAIL-BRUNDAMవరంగల్ నగరంలో మోనోరైలు ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. గురువారం (ఫిబ్రవరి-22) స్విట్జర్లాండ్ కు చెందిన ఇంటమిన్ ట్రాన్స్ పోర్టేషన్ కంపెనీకి చెందిన ఏడుగురు ప్రతినిధుల బృందం వరంగల్ లో పర్యటించింది. నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించింది. నగరంలో మోనోరైలు ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదించిన రూట్లలో మేయర్ నరేందర్ వారిని స్వయంగా తిప్పారు. మంత్రి కేటీఆర్ ఇటీవల స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు వరంగల్ లో మోనో రైలు కోసం ఇంటమిన్ కంపెనీ దగ్గర ప్రతిపాదించారు. దీంతో, గతంలో ఒకసారి అధ్యయనం చేసిన కంపెనీ బృందం, సాధ్యాసాధ్యాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించింది. రూ.12 వందల కోట్ల ఖర్చుతో వరంగల్ లో మోనో రైలు ప్రాజెక్టుని ప్రారంభించాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ సందర్భంగా వెయ్యి స్తంభాల గుడిని, ఆలయాన్ని స్విట్జర్లాండ్ కంపెనీ ప్రతినిధులు సందర్శించారు.

Posted in Uncategorized

Latest Updates