మోసం చేసిందన్న కాంగ్రెస్ తో జత కట్టారు : రాకేష్

ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా.. మోసం చేశారు అంటూ చెబుతున్న వారితోనే చేతులు కలిపటం ఇక్కడే చూస్తున్నాం అన్నారు బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్. రాష్ట్రాన్ని విడగొట్టి అన్యాయం చేసిందన్న కాంగ్రెస్ పార్టీతోనే జతకట్టిన టీడీపీ.. అవిశ్వాసం పెట్టటం విడ్డూరంగా ఉందన్నారు. పరస్పర విరోధం ఉన్న పార్టీలు ఈసారి అవిశ్వాసం పెట్టాయంటూ టీడీపీకి చురకలు అంటించారు. శాపగ్రస్తుల పార్టీగా ఉన్న కాంగ్రెస్ తో జతకట్టి.. టీడీపీ కూడా శాపగ్రస్తుల పార్టీగా చరిత్రలో మిగిలిపోతుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates