మోస్ట్ పాపులర్ : టైమ్ మ్యాగజైన్ లో నలుగురు ఇండియన్స్

Times LISTటైమ్ మ్యాగజైన్ లేటెస్టుగా ప్రచురించిన ప్రపంచంలోని వందమంది అత్యంత ప్రతిభావంతులైన ప్రముఖుల లిస్టులో నలుగురు భారతీయులకు చోటు లభించింది. ఓలా సంస్థ సహ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్, బాలీవుడ్ నటి దీపికా పదుకొనె, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల ఈ లిస్టులో ఉన్నారు.

అగర్వాల్ (32) స్థాపించిన క్యాబ్ కంపెనీ ప్రపంచంలోని అతి పెద్ద ప్రయాణికుల రవాణా సంస్థల్లో ఒకటిగా పేరు పొందింది. పలు హిందీ సినిమాలలో నటించిన దీపిక, ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ వంటి హాలీవుడ్ సినిమాలు కూడా చేశారు. దీపిక నటించిన పద్మావత్ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టుకు అనేక విజయాలు అందించిన ప్లేయర్. సత్య నాదెళ్ల భారత్‌లో జన్మించి  అంతర్జాతీయ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ CEOగా ఎదిగిన యువ సంచలనం. 2014లో CEO అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 130 శాతం పెరిగింది.

టైమ్ అత్యంత ప్రభావశీలుర 15వ వార్షిక జాబితాలో చోటుదక్కిన దేశనాయకుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తదితరులున్నారు. ఈ 100 మందిలో 45 మంది 40 ఏళ్ల వయసులోపు వారు. వీరిలో అతిపిన్న వయస్కురాలైన 14 ఏళ్ల బాలనటి మిల్లీబాబీ ఉన్నారు. క్రియాశీలత, నవ్యత్వం, విజయాల సాధన తదితర అంశాల ఆధారంగా అంతర్జాతీయంగా ప్రభావం చూపిన వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను ప్రభావశీలుర జాబితాలో చేరుస్తారు.

Posted in Uncategorized

Latest Updates