మోహిని ట్రైలర్ : ఎన్నో ఏళ్లుగా పూడ్చిపెట్టిన నిజం

మధేష్ డైరెక్షన్ లో త్రిష లీడ్ రోల్ లో నటించిన సినిమా మోహిని. ఈ మూవీ ట్రైలర్ ను సోమవారం (జూలై-16) ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది యూనిట్. 2 నిమిషాల 17 సెకన్లున్న ఈ ట్రలర్ లో.. ఎన్నో వేల సంవత్సరాలుగా పూడ్చిపెట్టబడిన నిజం.. అనే డైలాగ్‌ తో ప్రారంభమైంది. పలు ఆసక్తికర సన్నివేశాలు చూపించారు. చాలా ఏళ్లుగా పగతో రగిలిపోతున్న మోహిని.. తన పగను ఎలా తీర్చుకుందనే కథాంశంతో ఈ సినిమా రూపొందిందని తెలుస్తోంది. త్రిష నటన సినిమాకు బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. గతంలో త్రిష నాయకి అంటూ హారర్‌ మూవీ చేసింది. అయితే ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. త్రిష మరోసారి భయపెట్టడానికి వస్తున్న ఈ మూవీ జూలై 27న విడుదల కానుంది.

Posted in Uncategorized

Latest Updates