మౌనం వీడండి…మాట తీరు మార్చుకోండి : మోడీకి మన్మోహన్ కౌంటర్

mouniప్రధాని మోడీ టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఎపుడూ మౌనంగా కనిపించే ఆయన మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వంపైనా,  మోడీపైనా మాటల దాడి చేశారు. ఓ  ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మన్మోహన్ మట్లాడుతూ……. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ తనను మౌన్-మోహన్ సింగ్ అనేవారని గుర్తు చేశారు. అప్పుడు ఉచితంగా ఇచ్చిన సలహాను మోడీ ఇపుడు ఆయనే పాటిస్తున్నారని చెప్పారు.

కథువా, ఉన్నావ్ అత్యాచారాలపై అధికారంలో ఉన్నవాళ్లు వెంటనే స్పందిస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నదని తన అభిప్రాయమని చెప్పారు.   దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలపై ఇపుడు మోడీ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. మోడీ తాను ప్రధాని అన్న విషయం కూడా మరిచిపోయినట్లున్నారనీ, ఆయనకు త్వరగా జ్ఞానోదయం కలగాలని కోరుంటున్నట్లు చెప్పారు. దేశంలో బ్యాంకింగ్ మోసాలు, మైనారిటీ, దళితులపై జరుగుతున్న దాడులపై నోరెందుకు మెదపడం లేదని మోడీని ప్రశ్నించారు మన్మోహన్. మహిళలు, చిన్నారులపై జరిగే అత్యాచారాలకు ఏం సమాధానం చెబుతారని అడిగారు. దీనిపై ప్రధానిగా మోడీ స్పందించకపోతే ప్రజాగ్రహం ఎదుర్కోక తప్పదనీ హెచ్చరించారు.  చివరగా కొన్ని హితబోధలు కూడా చేశారు మన్మోహన్. ప్రధాని హోదాలో ఉన్న మోడీ మాటతీరు కూడా మార్చుకోవాలన్నారు. లేకపోతే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు

Posted in Uncategorized

Latest Updates