మ్యాచ్ ఫిక్సింగ్ చేశా..క్షమించండి: డానిష్ కనేరియా

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో తప్పు ఒప్పుకొన్నాడు పాకిస్ధాన్ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా. ఆరేళ్ల నుంచి అబద్ధాలు చెబుతూ ఇప్పుడు నిజం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి, నాకెంతో భారంగా ఉందిని, నన్ను క్షమించండి అంటూ కనేరియా ప్రాధేయపడ్డాడు. ఇలాంటి ఘోర తప్పిదాలు చేయొద్దని యువ ఆటగాళ్లకు చెప్పడం ద్వారా ఆటకు నేను సేవ చేయగలనని కనేరియా అన్నాడు.

నా పరిస్థితిని అర్థం చేసుకోవాలని క్రికెట్‌ బోర్డు, అభిమానులు, ప్రజలను కోరుకుంటున్నా. దయచేసి నన్ను మన్నించండి. బుకీ అనుభట్‌ ను కలిసి చాలా పెద్ద తప్పుచేశా. అధికారులకు ఈ విషయాన్ని తెలియజేయలేదు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నా అని కనేరియా అన్నాడు. నేను చేసింది చాలా పెద్ద తప్పు. ప్రజలు నన్ను క్షమిస్తారని అనుకుంటున్నా.

స్పిన్‌ మాయాజాలంతో పాక్ జట్టుకు మంచి విజయాలు అందించిన డానిష్ కనేరియా 2010లో ఇంగ్లండ్‌ లో  అతడు చివరి టెస్టు ఆడాడు. స్ఫాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు కనేరియాపై జీవిత కాల నిషేధం విధించింది.

Posted in Uncategorized

Latest Updates