మ్యాన్ హోల్ లో ఇద్దరు కార్మికుల మృతి

man-holeఇద్దరు పారిశుధ్య కార్మికులను మ్యాన్‌హోల్‌ పొట్టనపెట్టుకుంది. హైదరాబాద్ లోని ఉప్పల్‌ స్టేడియం  గేట్‌ నంబర్‌ 1 దగ్గర బుధవారం(మే-30) ఈ సంఘటన జరిగింది. మ్యాన్‌ హోల్‌ లోపలికి దిగిన కార్మికులు సంతోష్‌(28), విజయ్‌(25)లు ఊపిరి ఆడకపోవడంతో మృతి చెందారు.

ఒడిశాకు చెందిన సంతోష్‌, విజయ్‌ చిలుకానగర్ లో ఉంటున్నారు. వీరు హైదరాబాద్‌ ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ సంస్థలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇటీవల క్రికెట్ స్టేడియం దగ్గర  జలమండలి అధికారులు తాగునీటి పైపు లైన్ నిర్మించారు. అక్కడే మ్యాన్‌హోల్‌ ఏర్పాటు చేశారు. మ్యాన్‌హోల్‌ లోపల ఉన్న సెంట్రింగ్ కర్రలు తీయడానికి బుధవారం సంతోష్‌, విజయ్‌ లోపలికి దిగారు. ఊపిరి ఆడకపోవడంతో లోపలే మృతి చెందారు. వీరు ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి కార్మికులు లోపలికి వెళ్లి చూడగా చనిపోయి ఉన్నారని తెలిపారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates