మ‌త్స్య‌కారుల‌కు అండ‌గా ఉంటా : ప‌వ‌న్

PAWAN1ప్ర‌జా సంక్షేమంప‌ట్ల జ‌న‌సేన పార్టీకి నిబ‌ద్ధ‌త ఉంద‌న్నారు ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల‌ను పార్టీల‌క‌తీతంగా ప‌రిష్క‌రించేందుకు ప్ర‌తీ ఒక్క‌రూ ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన మత్స్యకారులు కలిశారు. గత కొన్ని రోజులు మత్స్యకారులు తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే సోమవారం(ఫిబ్రవరి-5) పవన్ కల్యాణ్ ను కలిశారు. మత్స్యకారులు తమ సమస్యలను వివరించారు.

మ‌త్స్య‌కారుల‌కు అండ‌గా ఉంటాన‌ని తెలిపారు ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇందులో భాగంగా మ‌త్స్య‌కారుల‌ను ఎస్టీల్లో చేర్చే ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని పుదుచ్చేరి మంత్రి మ‌ల్లాడి కృష్ణారావు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప‌వ‌న్ .. మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌లు త‌న‌కు తెలుస‌ని, వాళ్లు ఎస్టీ జాబితాలో ఉండాల్సిన వారేన‌ని అన్నారు. మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ను పార్టీల‌క‌తీతంగా ప‌రిష్క‌రించాల‌ని కోరిన ప‌వ‌న్ .. రాష్ట్ర ప్ర‌భుత్వం చొర‌వ తీసుకుని ఎంపీల‌తో పార్ల‌మెంటులో చ‌ర్చించే విధంగా చూడాల‌ని కోరారు.

పుదుచ్చేరి మంత్రి మల్లాడిపై పవన్‌ కల్యాణ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజా సంక్షేమం కోసం గురించి ఆలోచించే వ్యక్తి మల్లాడి అని.. ప్రజా సంక్షేమం పట్ల ఆయనకు నిబద్ధత ఉందన్నారు పవన్. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయనకు అండగా ఉంటామన్నారు.

Posted in Uncategorized

Latest Updates