మ‌ధ్యాహ్నం 1గంట వ‌ర‌కు ఫ‌లితాలు: ర‌జ‌త్ కుమార్

డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు మంగళవారం (రేపు) ఉదయం 8 గంట‌ల‌కు ప్రారంభం కానున్నట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి (CEO) ర‌జ‌త్ కుమార్. ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్లు లెక్కిస్తామ‌ని చెప్పారు. ఎన్నిక‌ల కౌంటింగ్ క్రమంలో రేపు సెల‌వురోజుగా ప్ర‌క‌టించామన్నారు. ఒక్కో నియోజక వర్గంలో 14 టేబుల్స్ ఉన్నాయని…మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తామన్నారు. మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు కౌంటింగ్ ఫ‌లితాలు తెలిసే అవ‌కాశ‌ముందన్నారు. కౌంటింగ్ సెంటర్ల దగ్గర దాదాపు 20 వేల మంది పోలీసుల‌తో భ‌ద్ర‌త ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 43 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశామని… హైద‌రాబాద్ లో 13, మిగ‌తా జిల్లాల్లో ఒక్కొక్క‌టిగా ఉన్నాయన్నారు. కౌంటింగ్ కేంద్రానికి మొబైల్ అనుమ‌తి లేదని.. లెక్కింపు పూర్త‌యే వ‌ర‌కు కౌంటింగ్ ఏజెంట్లు బ‌య‌ట‌కు వెళ్లేందుకు అనుమ‌తించ‌బోమన్నారు. శేరిలింగంప‌ల్లిలో అత్య‌ధిక (42) రౌండ్ల‌లో, బెల్లంప‌ల్లిలో అత్య‌ల్ప(15) రౌండ్లలో లెక్కింపు జ‌రుగనుందని తెలిపారు. ప్రతి రౌండ్‌లోని ఆయా నియోజకవర్గంలోని అభ్యర్థులకు చూపించిన తర్వాతనే ఫలితాలు ఇస్తామన్నారు. కౌంటింగ్ సెంటర్ల దగ్గర 144 సెక్ష‌న్ అమ‌లులో ఉంటుంద‌న్నారు.

2,379 రౌండ్స్‌లో లెక్కింపు పూర్త‌వుతుందని తెలిపారు. లెక్కింపును 1,916 మంది మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల‌తో ప‌ర్య‌వేక్షిస్తామన్నారు. పాస్ లు జారీ చేసిన ప్ర‌కారం కౌంటింగ్ సెంటర్ లోకి మీడియాను అనుమ‌తిస్తామన్నారు. ఓట్ల కౌంటింగ్ కు ప్ర‌జ‌లు, మీడియా అన్ని రాజ‌కీయ పార్టీలు పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు CEO ర‌జ‌త్ కుమార్.

Posted in Uncategorized

Latest Updates