యజమాని ఆధార్ తో లింక్ : పశువులకు విశిష్ట గుర్తింపు సంఖ్య ఇచ్చిన మధ్యప్రదేశ్

aniమధ్యప్రదేశ్ లోని 2.5 లక్షల పశువులకు ఆధార్‌ టైప్ లో విశిష్ట గుర్తింపు సంఖ్య (UID)ను అధికారులు జారీ చేశారు. నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డు (NDDB) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా దీన్ని అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆవులు, గేదెలకు UIDని కేటాయించి ఎనిమల్ ప్రొడక్టవిటీ అండ్ హెల్త్ సమాచార వ్యవస్ధ పేరుతో వివరాలను నమోదు చేయనున్నట్లు తెలిపారు. పశువుల వయసు, జాతి, ఇతర లక్షణాలను ఇందులో నమోదు చేసుకొని, ఆ పశువు యొక్క యజమాని ఆధార్‌తో ఈ UIDని అనుసంధానం చేస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్‌ లోని 90 లక్షల పాడిపశువులకు ఈ UID లను కేటాయించనున్నామని, మొదటి దశలో 40లక్షల ట్యాగ్‌లను పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. ఇప్పటికి 2.5 లక్షల ట్యాగ్‌ లను పశువుల చెవులకు బి పూర్తి అయిందని మధ్యప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధకశాఖ అధికారులు తెలిపారు. పశువుల చట్టవిరుద్ధ అమ్మకాలు, అక్రమ తరలింపులను ఈ వ్యవస్థతో గుర్తించే సౌకర్యం ఉంటుందని వారు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates