యడ్డీ కథ ముగిసింది : మూడుసార్లు సీఎం అయినా కాలం కలిసిరాలేదు

HYKబీజేపీ సీనియర్ నాయకుడు యడ్యూరప్ప కథ ముగిసింది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటికీ యడ్డీకి.. అది ముణ్నాళ్ల ముచ్చటగానే మారింది. 2007లో 8 రోజులు, 2008లో 3 సంవత్సరాల 2 నెలలు, ఇప్పుడు 55 గంటలు మాత్రమే సీఎంగా కొనసాగారు. ప్రస్తుతం సాధారణ మెజార్టీ కోసం యడ్యూరప్ప చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ కాంగ్రెస్, జేడీఎస్ నేతలతో జరిపిన బేరసారాలు ఫలించలేదు. దీంతో బలపరీక్ష కంటే ముందే యడ్డీ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

యడ్యూరప్ప తొలిసారిగా సీఎం బాధ్యతలు చేపట్టినప్పుడు కేవలం 8 రోజులు మాత్రమే సీఎంగా ఉన్నారు. 2007 నవంబర్ 12న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యడ్డీ.. జేడీఎస్ సహకారంతో సంకీర్ణ పాలనకు శ్రీకారం చుట్టారు. కానీ జేడీఎస్ మద్దతుకు అంగీకరించకపోవడంతో 8 రోజులకే యడ్యూరప్ప పదవికి కోల్పోవాల్సి వచ్చింది.
ఇక రెండోసారి 2008 మే 30న సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే అక్రమ మైనింగ్ కేసును దర్యాప్తు చేస్తూ కర్ణాటక లోకాయుక్త సీఎం యడ్యూరప్ప పేరును చేర్చడంతో బీజేపీ అధిష్టానం ఒత్తిడి మేరకు 2011, జులై 31న సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పుడు 3 సంవత్సరాల 2 నెలలు సీఎం కుర్చీలో కూర్చున్నారు యడ్యూరప్ప. ఇక ఇప్పుడు సాధారణ మెజార్టీ లేకపోవడంతో బలపరీక్ష కంటే ముందే యడ్డీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈసారి కేవలం 55 గంటలు మాత్రమే సీఎంగా కొనసాగారు.

Posted in Uncategorized

Latest Updates