యడ్డీ రాజీనామా..ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ విజయం: మమత

కన్నడ రాజకీయాలపై స్పందించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కర్ణాటక సీఎం యడ్యురప్ప తన పదవికి రాజీనామా చేయడంతో…ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. అంతకు ముందు ఆ రాష్ట్ర అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్నిప్రవేశ పెట్టిన  యడ్యూరప్ప… తగినంత సంఖ్యా బలం లేక పోవడంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. యడ్యురప్ప రాజీనామా…ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ విజయమన్నారు సీఎం మమతా. మరోవైపు JDS చీఫ్ దేవె గౌడ, కుమార స్వామి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యలను అభినందించారు మమత.

యడ్యూరప్ప రాజీనామా చేసిన వెంటనే కుమారస్వామి తనతో మాట్లాడారని..తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హజరుకావాల్సిందిగా కుమారస్వామి తనని ఆహ్వానించినట్లు మమత బెనర్జీ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates