యడ్యూరప్ప ధీమా ఏంటో : 17న సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తా

yaddeకర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. గంట గంటకు మలుపులు తిరుగుతూ బెంగళూరు వేదికగా రాజకీయాలు వేడెక్కాయి. ఏ పార్టీకి కూడా పూర్తి మెజార్టీ రాకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇప్పటికే బీజేపీ నేతలు మైండ్ గేమ్ మెదలుపెట్టారు. జేడీఎస్ నుంచి 13 మంది ఎమ్మేల్యేల సపోర్టు తమకు ఉందని.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ తమకు ఉన్నందున అసెంబ్లీలో బలనిరూపణకు మెదట తమకే అవకాశం ఇవ్వాలని గవర్నర్ కు లేఖ ఇచ్చారు.

మరోవైపు బుధవారం(మే-16) జరిగిన బీజేపీ ఎల్పీ మీటింగ్ లో శాసనసభాపక్ష నేతగా యడ్యూరప్పను ఎన్నుకున్నారు. ముందుగా చెప్పినట్లుగానే మే 17వ తేదీ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేస్తానని.. యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను ఆపరేషన్ లోటస్ కు గురికాకుండా ఇప్పటికే జేడీఎస్, కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలు మెదలుపెట్టాయి. బుధవారం ఉదయం జరిగిన కాంగ్రెస్ ఎల్పీ మీటింగ్ కు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. తమ ఎమ్మెల్యేలను ఈగిల్ టన్ రిసార్ట్ కు తరలించింది కాంగ్రెస్. జేడీఎస్ కూడా తమ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించే ఏర్పాట్లు చేసింది.

Posted in Uncategorized

Latest Updates