యడ్యూరప్ప రాజకీయ ప్రస్థానం

yaddyurappa historyబీఎస్  యడ్యూరప్ప. పూర్తి  పేరు  బూకనకేరి  సిద్దలింగప్ప  యడ్యూరప్ప.  దక్షిణ  భారతంలో బీజేపీ  ముఖ్యనేత.  1943,  ఫిబ్రవరి 27న   మాండ్యా జిల్లాలోని బూకనకేరిలో  పుట్టారు. 1970లోనే   శికారిపుర  శాఖకు  రాష్ట్రీయ  స్వయం సేవక్  సంఘ్  కార్యదర్శిగా నియమితులయ్యారు.  1972లో  తాలుకా  శాఖకు  జనసంఘ్  అధ్యక్షుడిగా,  1975లో శికారిపుర  పురపాలక  సంఘ అధ్యక్షుడిగా  వ్యవహరించి … అత్యవసర  పరిస్థితి  కాలంలో జైలుకూ వెళ్ళారు. 1980లో  BJP  ఆవిర్భావంతో  శికారిపుర తాలూకా కు…..భారతీయ  జనతా పార్టీ  అధ్యక్షుడిగాను,  ఆ తరువాత  శిమోగా జిల్లా…. భారతీయ జనతా పార్టీ  అధ్యక్షుడుగాను  పనిచేశారు.

1988 నాటికి  కర్ణాటక రాష్ట్ర  భారతీయ జనతా  పార్టీ అధ్యక్షుడిగా  ఎదిగారు. 1983లో  శికారిపుర  శాసనసభ  నియోజకవర్గం  నుంచి కర్ణాటక  అపెంబ్లీలో  ప్రవేశించి ….అప్పటినుంచి  వరుసగా  ఏడో  సారి  అదే స్థానం  నుంచి ఎన్నికయ్యారు. 2007 నవంబర్ లో  మొదటిసారిగా  కర్నాటక  ముఖ్యమంత్రిగా  పదవీ బాధ్యతలు  స్వీకరించారు.  తరువాత  JDS  మద్దతు  ఉపసంహరణతో  రాజీనామా  చేశారు. మళ్లీ  6నెలల  తరువాత  జరిగిన  ఎన్నికలలో  …BJP  విజయం సాధించడంతో మే 30,  2008న  రెండో సారి …కర్ణాటక ముఖ్యమంత్రిగా  ప్రమాణస్వీకారం చేశారు  యడ్యూరప్ప. దక్షిణ భారతదేశంలో  ముఖ్యమంత్రి   పీఠాన్ని అధిష్టించిన  తొలి భారతీయ  జనతా పార్టీ  నేతగా  రికార్డు  సృష్టించాడు.

BJP, JDS  కూటమి  ప్రభుత్వంలో  కుమారస్వామి  సీఎంగా  ఉండగా.. యడ్యూరప్ప  ఉప ముఖ్యమంత్రిగా,  ఆర్థిక మంత్రిగా బాధ్యతలు  నిర్వహించారు. 2011లో  అవినీతి ఆరోపణలతో  యడ్యూరప్ప  BJPకి  దూరమయ్యారు. భూకేటాయింపుల్లో  అవకతవకలు  జరిగాయన్న ఆరోపణలపై  విచారణ కూడా  ఎదుర్కొన్నారు. 2011 అక్టోబర్  15న  అరెస్టయ్యారు. 23రోజుల  జైలు  జీవితం  తరువాత …ఆయన విడుదలయ్యారు.  కానీ నేరనిరూపణ  జరగకపోవడంతో  యడ్డీని  నిర్దోషిగా  ప్రకటించింది  న్యాయస్థానం. తరువాత  మళ్లీ  యడ్యూరప్పను  BJP లోకి  ఆహ్వానించింది  అధిష్ఠానం. ప్రస్తుతం  ఆయన  షిమోగ నియోజకవర్గం  నుంచి  ఎంపీగా  ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  మొన్నటి  ఎన్నికల్లో  షికారిపురా  నుంచి పోటీచేసి  ఎమ్మెల్యేగా  విజయం  సాధించిన  యడ్యూరప్ప..నేడు కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Posted in Uncategorized

Latest Updates