యమునా నదిలో డేంజరస్ లెవల్ దాటిన నీటిమట్టం

ఢిల్లీ యమునా నదిలో నీటిమట్టం డేంజర్ లెవల్ మార్క్ ను దాటింది. యమునా ఘూట్ దగ్గర నది ఉదృతంగా ప్రవహిస్తోంది. నది దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. ఎవ్వరూ కూడా యమునా నదిలో ఈత కొట్టేందుకు వెళ్లవద్దని సూచించారు. 10 సమస్యాత్మక ప్రాంతాలలో తాము గుడారాలను ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైన అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని ఢిల్లీ ఈస్ట్  డిస్ట్రిక్ట్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్(SDM) అరుణ్ గుప్తా తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. నదిలో నీటిమట్టం మరింతపెరిగే అవకాశముందని తెలిపారు. రెస్కూ, రిలీఫ్ ఆపరేషన్ కోసం 43 బోట్లను రంగంలోకి దించామని తెలిపారు.

హర్యానాలోని  హథిని కుండ్ బ్యారేజీ నుంచి 3లక్షల 11వేల 190 క్యూసెక్కుల  వాటర్ శనివారం ఉదయం విడుదల చేశారు.దీంతో నదిలో నీటిమట్టం పెరిగింది. ఢిల్లీలోని ఓల్డ్ ఐరన్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర యమునా నదిలో నీటిమట్టం 205.4 మీటర్లకు చేరుకొంది. నీటిమట్టం డేంజరస్ లెవల్ ను క్రాస్ అయింది.

Posted in Uncategorized

Latest Updates