యమ స్పీడ్ గా : భారత్ లో 5G ఇన్నోవేషన్ ల్యాబ్

BARATHస్పీడన్ కు చెందిన టెలీకమ్యూనికేషన్స్ కంపెనీ “ఎరిక్సన్” మంగళవారం(జులై-3) భారత్ లో  మొట్టమొదటి 5G ఇన్నోవేషన్ ల్యాబ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఢిల్లీ ఐఐటీలో లాంచ్ చేసింది. కేంద్రమంత్రి మనోజ్ సిన్హా దీన్ని ప్రారంభించారు. రానున్న 2-3 ఏళ్లలో  భారత్ లో 5Gని రియాల్టీలోకి తీసుకొచ్చేందుకు మొత్తం ఎకో-సిస్టమ్ కలిసి పనిచేయాలని సిన్హా తెలిపారు. హెల్త్, ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, మరికొన్ని ఇతర రంగాల్లో 5Gటెక్నాలజీని సమర్ధంగా ఉపయోగించుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సిన్హా తెలిపారు. భారత్ లో డేటా వినియోగదారులు అధికసంఖ్యలో ఉన్నారని, ప్రపంచంలోని అన్నీ దేశాల్లో కన్నా భారత్ లోనే డేటా వినియోగం అధికంగా ఉంటుందని ట్రాయ్ చైర్మన్ ఆర్ ఎస్ శర్మ తెలిపారు.

రానున్న 2-3 ఏళ్లలోనే భారత్ లో 5G వినియోగంలోకి వస్తే ఇక భారత్ అన్నీ రంగాల్లో దూసుకెళ్లడం ఖాయం. భారత్ లో 5G ఇన్నినోవేషన్ ల్యాబ్ ను  ఎరిక్సన్ లాంచ్ చేయడంపై అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే భారత్ సూపర్ పవర్ గా ఎదగే కాలం దగ్గరపడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates