యమ స్పీడ్ : తీరప్రాంత భద్రతా దళంలోకి అత్యాధునిక యుద్దనౌక

RASభారత తీరప్రాంత భద్రతా దళంలో మరో అత్యాధునిక నౌక చేరింది. AP విశాఖ తీరం కేంద్రంగా సేవలందించేందుకు పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసిన రాణి రష్మోణి పేరుతో రూపొందించిన అత్యాధునిక యుద్దనౌక కోస్టుగార్డులో చేరింది. అత్యంత వేగంగా ప్రయాణించే నౌకలలో ఇది ఐదోదని నేవీ అధికారులు తెలిపారు. విశాఖ సాగరతీరంలో కోస్టుగార్డు అదనపు డైరెక్టర్ జనరల వీఎస్ఆర్ మూర్తి దీన్ని ప్రారంభించారు.

గంటకు 34 నాటికల్ మైళ్ల స్పీడ్ తో ప్రయాణించే ఈ నౌకను విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డు నిర్మించింది. నౌక పొడవు 51 మీటర్లు. 8.36 మీట్ల వెడల్పు, 345 టన్నుల బరువుతో దీనిని రూపొందించారు. ఇందులో రెండు జనరేటర్లు, సెన్సర్లు, హైఫ్రీక్వెన్సీ ఉన్న రేడియో సెట్లు, లేటెస్ట్ టెక్నాలజీ పరికరాలు ఉన్నాయి. విశాఖ కేంద్రంగా పనిచేయనున్నరాణి రష్మోణిలో కమాండర్ తో పాటు నలుగురు అధికారులు, 34 మంది సిబ్బంది పనిచేయనున్నారు. తూర్పు తీరంలో కీలకమైన కోస్టా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని కోస్ట్ గార్డు అధికారులు చెప్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates