యస్ ఆర్ నో మాత్రమే చెప్పండి : జూకర్ బర్గ్ పై అమెరికా కాంగ్రెస్ ప్రశ్నల వర్షం

LKJయూజర్ల డేటా లీకేజీ విషయంలో రెండో రోజు అమెరికా కాంగ్రెస్ ఎదుట విచారణకు హాజరయ్యారు ఫేస్ బుక్ CEO జూకర్ బర్గ్. హౌస్‌ ఆఫ్‌ ఎనర్జీ, కామర్స్‌ కమిటీకి చెందిన రిపబ్లికన్‌, డెమోక్రాట్‌ సభ్యులు ప్రశ్నలతో జూకర్ బర్గ్ ని ఉక్కిరిబిక్కిరి చేశారు. 5 గంటలు సాగిన విచారణలో డేటా లీకేజీ, కంపెనీ ప్రైవసీ నిబంధనలు, ఒపియాడ్‌ సంక్షోభం వంటి అంశాలపై సభ్యులు జూకర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు తడబడ్డారు జూకర్ బర్గ్.

ఓ సెనెటర్ ప్రశ్నకు సమాధానంగా.. అభ్యంతరకరంగా ఉన్న కంటెంట్ ను తొలగించడానికి తమ ఆఫీసులో 200 మంది కూంటర్ టెర్రరిజమ్ టీమ్ ఉన్నట్లు తెలిపారు. విచారణ సమయంలో జుకర్‌ బర్గ్‌ ను ఓ సెనేటర్‌ తన ప్రశ్నలకు ‘యస్’ ఆర్ ‘నో’ అనే సమాధానాలు చెప్పాలని అడిగారు. ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమంలో ఓ దశలో అసహనానికి గురయ్యాడు జూకర్ బర్గ్. బుధవారం(ఏప్రిల్-11) కూడా ప్రశ్నల సమయంలో డేటా లీకేజీ వాస్తమేనని అంగీకరించి క్షమాపణలు చెప్పాడు. అనేక అంశాల్లో తాము మెరుగుపడాల్సి ఉందని, ఇకపై డేటా దుర్వినియోగం జరగకుండా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపాడు. మొదటి రోజు ఆత్మవిశ్వాసంతో తడబాటు లేకుండా కనిపించిన జుకర్‌బర్గ్‌ ఈ రోజు మాత్రం విసుగ్గా కనిపించారు.

Posted in Uncategorized

Latest Updates