యాక్షన్ సినిమా సరిపోదు : ఎమ్మెల్యేల తరలింపులో కాంగ్రెస్ భీకర వ్యూహాలు

flight-bus-carకర్నాటక రాజకీయం అసలు సిసలు యాక్షన్ సినిమాను తలపిస్తోంది. మరికొన్ని గంటల్లో బెంగళూరులోని విధాన సభలో జరగబోయే బలపరీక్షకు కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికారం దక్కించుకోవాలని రెండు పార్టీలు ఎత్తులు –పైఎత్తులు వేస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. కాంగ్రెస్ – జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రస్తుం హైదరాబాద్ లో ఉన్నారు. తాజ్ కృష్ణ, నోవాటెల్ హోటళ్లలో బస చేశారు. 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అత్యంత నాటకీయంగా ఈ ఉదయం హైదరాబాద్ చేరిన వీరు.. ఇప్పుడు మళ్లీ తిరిగి బెంగళూరు చేరాల్సి ఉంది. శనివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీకి హాజరుకావాల్సి ఉంది. అయితే హైదరాబాద్ నుంచి వీరిని ఏ విధంగా బెంగళూరు తీసుకెళ్లాలి.. మధ్యలో బీజేపీ వ్యూహాలను చిత్తు చేస్తూ ఎలా వెళ్లాలి అనే విషయంలో కాంగ్రెస్ – జేడీఎస్ వ్యూహాలు రచించింది.

ప్లాన్ వన్ :

ఇప్పటికే ప్రత్యేక విమానం సిద్ధం చేసుకుంది. 100 సీట్లు బుక్ చేసుకున్నది. టైం మాత్రం ఫిక్స్ చేసుకోలేదు. ఏ క్షణం అయినా బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యేలు. ప్రత్యేక విమానం కాబట్టి ఎయిర్ పోర్ట్ కు చేరుకుని.. అక్కడి నుంచి గంటన్నరలో బెంగళూరులో ల్యాండ్ అవ్వొచ్చు. బెంగళూరులో ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరించటాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. ఈ ప్లాన్ లో ఇబ్బందులు ఉండొచ్చని కూడా భావిస్తోంది.

ప్లాన్ టూ :

నాలుగు ఏసీ స్లీపర్ బస్సులు రెడీ చేసుకుంది. హైదరాబాద్ టూ బెంగళూరు 550కిలోమీటర్లు. హై ఎండ్ బస్సులు కాబట్టి 8 గంటల్లో వెళ్లిపోవచ్చు. తెలంగాణ బోర్డర్ వరకు ఇక్కడి కాంగ్రెస్ నేతల సహకారం తీసుకోవాలి. నేతలు, కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఇస్తూ తెలంగాణ బోర్డర్ దాటాలి. అక్కడి నుంచి ఏపీలోకి ఎంటర్ అయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో.. బెంగళూరుకి అత్యంత సురక్షితంగా వెళ్లిపోవచ్చని భావిస్తున్నారు. రోడ్డు మార్గం ద్వారా వెళ్లటానకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మొగ్గు చూపిస్తున్నారు.

ప్లాన్ త్రీ :

ఫ్లయిట్ కాలేదు.. బస్సుల్లో వెళితే ఎక్కడైనా ఇబ్బంది పెడతారు అనుకుంటే.. ప్లాన్ 3 అమలు చేయాలని నిర్ణయించింది. అందుకోసం 25 ఫార్చ్యునర్ కార్లను సిద్ధం చేసింది. ఒక్కో కారులో నలుగురు ఎమ్మెల్యేల చొప్పున 100 మందికి అవసరం అయిన 25 కార్లను రెడీ చేసింది. కర్నాటక నుంచి వచ్చిన కార్లతోపాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ ఫార్చ్యునర్ కార్లను ఇప్పటికే రెడీ చేశారు. 25 కార్లలో ఎమ్మెల్యేలు.. మరో 25 కార్లలో నేతలు, కార్యకర్తలు బెంగళూరు వెళ్లేందుకు రెడీగా ఉన్నారు. 50 కార్లతో పెద్ద ర్యాలీగా బెంగళూరు వెళ్లాలనేది మూడో ప్లాన్.

మరికొన్ని గంటల్లోనే అసలు సిసలు యుద్ధం.. అసెంబ్లీలో జరగబోతున్నది. మూడు రోజులుగా ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ వస్తున్న కాంగ్రెస్ – జేడీఎస్.. ఈ ఒక్క రోజు మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ఈ మూడు ప్లాన్స్ వేసింది. బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో 17వ తేదీ అర్థరాత్రి జరిగిన హైడ్రామాతో ఈ మూడు ప్లాన్స్ సిద్ధం చేసుకుంది. ఏ క్షణం అయినా హైదరాబాద్ నుంచి కర్నాటక ఎమ్మెల్యేలు బయలుదేరి వెళ్లనున్నారు.

Posted in Uncategorized

Latest Updates