యాక్సిడెంటా, మిస్టరీనా….4 ఓల్వో బస్సులు దగ్థం

బేనేబే
హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. బహుదూర్ పురలోని ఓమర్ ట్రావెల్స్ కు చెందిన 4 ఓల్వో బస్సులు దగ్ధమయ్యాయి. వోల్వో బస్సులకు మంటలు అంటుకోవటంతో… భారీ నష్టం వాటిల్లింది. పార్కింగ్ లో ఆగి ఉన్న మరో రెండు లారీలు పూర్తిగా కాలిపోయాయి. ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు. ప్రతీ ఏటా ఓమర్ పార్కింగ్ స్థలంలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నా అధికారులు, బస్సు యాజమాన్యం పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates