యాక్సిడెంట్ జరిగింది : బతికే ఉన్నట్లు ప్రకటించిన హీరోయిన్ మోనాల్

మోనాల్ గుజ్జార్.. టాలీవుడ్ హీరోయిన్. అల్లరి నరేష్ తో కలిసి బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ, సుడిగాడు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత చిన్నాచితక పాత్రలు కూడా చేసింది. తెలుగు నుంచి తమిళంకి వెళ్లి.. నాలుగు సినిమాల్లో నటించింది. బెంగాళీ, గుజరాతీ భాషల్లోని సినిమాల్లోనూ నటించింది. హీరోయిన్ మోనాల్ ప్రయాణిస్తున్న కారు జూలై 11వ తేదీ సాయంత్రం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కు సమీపంలో యాక్సిడెంట్ కు గురైంది. కారు నుజ్జునుజ్జు అయ్యింది. వెనక కారు చక్రాలు ఊడిపోయాయి. ఉదయ్ పూర్ లోని తన స్నేహితుడు రోహిత్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు అహ్మదాబాద్ నుంచి ఉదయ్ పూర్ వెళ్లింది. పార్టీ తర్వాత తిరిగి అహ్మదాబాద్ బయలుదేరారు. ఉదయ్ పూర్ జాతీయ రహదారిపై ఆమె ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢికొట్టింది.

ఈ యాక్సిడెంట్ లో కారులోని మోనాల్ గుజ్జార్ తోసహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఎవరూ చనిపోలేదు. కొన్ని ఛానల్స్, సోషల్ మీడియాలో హీరోయిన్ మోనాల్ గుజ్జార్ చనిపోయినట్లు ప్రకటించేశారు. ఈ విషయం తెలిసిన మోనాల్.. సోషల్ మీడియా ద్వారా స్పందించారు. యాక్సిడెంట్ జరిగింది నిజమే అన్నారు. మెడకు బలమైన గాయం అయ్యిందని.. చనిపోలేదని ప్రకటించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యానని.. త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని వెల్లడించారు.

Posted in Uncategorized

Latest Updates