యాచకురాలి అదృశ్యం.. ఇంట్లో దొరికిన రూ.2.31 లక్షలు

 సూరారంలో కనిపించకుండా పోయిన ఓ యాచకురాలి ఇంట్లో నోట్లకట్టలు బయటపడ్డాయి.   సంగారెడ్డి జిల్లా జిన్నారం ప్రాంతానికి చెందిన వృద్ధురాలు ఎస్‌.విజయలక్ష్మి సూరారం కాలనీ రాజీవ్ గృహకల్ప లో రెంట్ కు ఉంటుంది. విజయలక్ష్మి హైదరాబాద్ మెట్రో వాటర్‌ వర్క్స్‌లో పనిచేయగా.. 2016లో ఆమె సస్పెన్షన్‌కు గురైంది. గతకొంతకాలంగా ఆమె కనిపించకుండా పోవడంతో.. ఆమె కిరాయి ఉంటున్న ఇంటిని ఖాళీ చేయించడానికి ఇంటి ఓనర్ తాళాన్ని పగులకొట్టాడు. దీంతో నాలుగు బస్తాల్లో 10, 50, 100 రూపాయల నోట్ల కట్టలు లభించాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఎన్నికల హడావుడిలో ఉన్నామని… ఎన్నికలైన తర్వాత నగదు లెక్కిద్దామని ఇంటికి తాళం వేశారు. గురువారం పోలీసుల సమక్షంలో నగదును లెక్కించగా వచ్చిన రూ.2 లక్షల 31 వేలను ఆమె కూతురికి అందచేశారు.  విజయలక్ష్మి ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు.

Posted in Uncategorized

Latest Updates